🔥 Burn Fat Fast. Discover How! 💪

పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే జీవితం లో వాళ్ళు కుటుంబం క | Inspiring Thoughts

పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే
జీవితం లో వాళ్ళు కుటుంబం కోసం చేసే త్యాగాలు ఇన్నా అనిపిస్తుంది

పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే
జీవితం ఎలా వృధా చేసుకో కూడదో అనిపిస్తుంది

పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే
భగవతచింతన చేస్తూ, ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది

పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే
ఒక మంచి నాయకుడు ఎలా ఉండాలో అనిపిస్తుంది

పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే
జీవిత భీమా యొక్క అవసరం విలువ తెలిసింది అనిపిస్తుంది

పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే
మనం కూడా జీవితంలో ఎదగాలి అంటే, ఇంత కఠోరంగా సాధన చేయాలా అనిపిస్తుంది.

పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే
మంచి పరిచయం ఉన్న అధికారులతో స్నేహం ఉంటే, పనులు ఇంత సులభంగా జరుగుతాయా అనిపిస్తుంది

పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే
మనకు తెలియని ప్రపంచం ఇంత ఉందా అనిపిస్తుంది.

పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే
వీళ్ళ వల్లే కదా మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాము అనిపిస్తుంది

పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే
వారు పడే కష్టం ముందు మన కష్టం ఏమీ కాదు అనిపిస్తుంది

పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే
వారి ముందు మన త్యాగం, సేవల ముందు, వాళ్ళ వల్ల మనమెంత అదృష్ట వంతులమో అనిపిస్తుంది .

పది నిమిషాలు మంచి స్నేహితుని ముందు కూర్చుంటే
జీవితంలో అనుకున్నవి సాధించాలంటే మంచి మిత్రుని అవసరం ఎంతైనా ఉండాలి అనిపిస్తుంది.