🔥 Burn Fat Fast. Discover How! 💪

Truely Inspiring.. use google translate to Read.. #telugu Lan | Inspiring Thoughts

Truely Inspiring.. use google translate to Read..
#telugu Language

మచిలీపట్నం దగ్గరలోని సీతారామపురంపల్లెలో ఒక రైతుకుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి, ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ”మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి” అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford, మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు.

అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ‘ లేదు ‘ అనిచెప్పాడు. ‘ భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ‘ అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.
శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.

#చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు ,చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో ” సూర్యుళ్ళు ” అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు....