Get Mystery Box with random crypto!

*దీరూబాయ్ అంబానీ* మరణించిన తర్వాత.... కుటుంబ ఆస్తి ని, *నాలుగు | Inspiring Thoughts

*దీరూబాయ్ అంబానీ* మరణించిన తర్వాత.... కుటుంబ ఆస్తి ని, *నాలుగు వాటాలుగా* పంచారు. *10 శాతం భార్యకి,10 శాతం కూతురికి, 40 శాతం పెద్దకొడుకు ముఖేష్ అంబానీకి, 40 శాతం చిన్న కొడుకు అనిల్ అంబానీ* కి.
పదేళ్ల తర్వాత చూస్తే..... అన్నదమ్ములు ఇద్దరి మధ్య, ఆస్తిలో తేడా.....సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే, అప్పుల ఊబిలో అనిల్ అంబానీ.

ఒక కుటుంబంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు,
ఓకే వాతావరణం లో
పెరిగిన ఇద్దరు వ్యక్తులు,
ఒకే రకమైన అవకాశాలను పొందిన ఇద్దరు వ్యక్తులు,
సమాన సంపదతో వ్యాపారాలు ప్రారంభించిన ఇతర వ్యక్తులు......
పది సంవత్సరాల్లో...
లక్ష కోట్ల.... తేడా....

ఇలాంటి వేలాది ఉదాహరణలు.... మన బంధువుల్లో, మన ఊర్లో, మన స్నేహితుల్లో కూడా చూడవచ్చు.

ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే.....Development is a Culture అనే అద్భుతమైన విషయం. అంటే అభివృద్ధి అనేది ఒక జీవన విధానం.

ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగం చేస్తున్నా... ఎప్పుడు చూసినా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని కొంతమందిని చూస్తాం.
కుటుంబంలో ఒకరే ఉద్యోగం చేస్తున్నా... ఎప్పుడూ నిండుకుండలా ఉండే, మరికొన్ని కుటుంబాలను చూస్తాం.

తేడా ఏంటి?
కొంతమంది ఎంత సంపాదించినా... ఎందుకు ఎదగలేక పోతున్నారు?
కొన్ని వర్గాలకు ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా... ఎందుకు ఎదగలేక పోతున్నారు?

కొంత మందికి తండ్రి దండ్రులు అన్నీ సమకూర్చినా... ఎందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు?

ఈ అంశాన్ని.... పరిశీలిస్తే అర్థమవుతుంది..... Development is a Culture..... అభివృద్ధి ఒక జీవన విధానం.

భారతీయ సమాజంలో.... కొన్ని కులాలు, ఆర్థికాభివృద్ధిలో ఇతరుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందడానికి... ఒక ప్రధాన కారణం...Development Orientation (అభివృద్ధి దృక్పథం) ఉండటం.
అది ఉన్న వాళ్ళు, వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటారు. అవకాశాలు లేకపోతే సృష్టించు కుంటారు. ఏదో విధంగా ముందుకు దూసుకుపోతారు.

నేను కూడా ధీరు బాయ్ అంబానీ కొడుకుని అయితే, ముకేశ్ అంబానీ లా సంపాదించే వాడిని అని చెబుతారు చాలామంది. కానీ ధీరుబాయ్ అంబానీ తండ్రి సామాన్యుడు అన్న విషయం గుర్తించరు.

నాకు తెలిసిన ఒక మాజీ మంత్రి... ఫుల్ బాటిల్ మద్యం తాగి కూడా, చాలా సాధారణంగా ఇంటికి వెళ్లిపోయే వాడు.
నాలుగు పెగ్గులు తాగి... చేసే పనిని, డబ్బుని, ఆరోగ్యాన్ని, కుటుంబ జీవితాన్ని... నాశనం చేసుకున్న మరి కొంతమంది కూడా నాకు తెలుసు.

అంటే ఒక చెడు
అలవాటును కూడా..... నియంత్రించే కొంతమంది... జీవితంలో ఎదుగుతూనే ఉంటే.......

ఆ బలహీనతను నియంత్రించలేని.... ఎంతోమంది..... రోడ్డున పడుతున్నారు.

అందుకే.......Development is a Culture.

మనలో చాలామందికి ఒక మానసిక జబ్బు ఉంది.
ఎవడైనా ముందుకు పోతుంటే.......
అతని కష్టాన్ని, అతని వ్యక్తిత్వం లోని మంచి లక్షణాలను చూడకుండా.....

తల్లిదండ్రులు
ఇచ్చిన ఆస్తిని,
పెళ్లి లో వచ్చిన కట్నాన్ని, అదే రంగం లో ఉన్న బంధువులను, అన్నిటికీ మించి.... అతని కులాన్ని చూసి.....
*వాడికి అన్నీ కలిసొచ్చాయి* అని తీర్పు చెప్తారు.

పాపం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి......*డబ్బులు ఎవరికి ఊరికే రావు* అని లలిత జ్యువెలర్స్ ..... గుండాయన ఎంత చెప్పినా.... ఎవరు సీరియస్ గా తీసుకోరు.

ఈ అంశం మీద చాలా చెప్పాలని ఉంది.

కానీ ఒక్క మాటతో ముగిస్తా....

ముందుకెళ్లాలన్న కసి....
కఠోర శ్రమ...
క్రమశిక్షణ...
ఎన్నో విషయాల్లో త్యాగాలు... లేకుండా.....

ఒక వ్యక్తి కానీ....
ఒక కుటుంబం కానీ....
ఒక కులం గాని....

అభివృద్ధి చెందినట్టు చరిత్రలో లేదు.

*జై శ్రీరామ్*