2022-05-07 05:33:30
అది-ఇది
కనుచూపు పారినంతమేరకు ఉన్నదే ప్రపంచం...
అన్నారు సద్గురుదేవులవారు...
ఇక ఆవల ఉన్నదంతా...
అనగా నీకు అనుభవంలో లేనిదంతా దైవమే...
"అది-ఇది" ఒకే వస్తువు...
అనుభవంలోకి రాని భాగాన్ని "అది" అన్నారు...
అనుభవంలోకి వచ్చినభాగాన్ని "ఇది" అన్నారు...
"అది" అంటే దైవము.
"ఇది" అంటే ప్రపంచము.
"అది" అంటే గాఢనిద్ర...
"ఇది" అంటే మెలకువ...
నీకు తెలిసిందంతా...
నీకు తెలియనిదాని యొక్క వ్యక్తరూపమే...
గాఢనిద్రలో బీజరూపంగా ఉంటుంది...
మెలకువలో ప్రపంచంగా విస్తరిల్లుతుంది...
కనుచూపుకు ఆవల ఉంటుంది దైవం...
కనుచూపుకు ఈవల ఉంటుంది దైవం...
ఆవలకు ప్రయాణించేవాడు - సైంటిస్టు.
ఈవలకు ప్రయాణించేవాడు - యోగి.
ప్రపంచం అనంతం అంటే...
దైవం కూడా అంత దూరమైపోతాడు...
ప్రపంచం కనుచూపు పారినంతమేరకే అంటే...
దైవం కాస్త నీకు దగ్గరవుతాడు...
గదిలో కూర్చొని ఉంటే...
గదికి ఆవల నుంచి ఉంటుంది దైవం...
కనులు మూసుకుంటే...
కనురెప్పల నుంచి ఉంటుంది దైవం...
అనగా-
నీకు కనబడేదంతా ప్రపంచం...
నీకు కనబడనిదంతా దైవం...
కాబట్టి "దైవదర్శనం" అనే మాట పొసగదు...
నీవు దర్శించేదంతా ప్రపంచాన్నే...
దర్శనం చేయాలంటే...
దర్శించేవాడు-దర్శింపబడేది అని రెండు ఉండాలి...
"రెండు" ఉండడమే ప్రపంచలక్షణం...
"రెండు" తోచకుండడమే సాక్షాత్కారం...
రమణులను ఒకరు అడిగారు...
దేవుడు కనబడితే ఏం కోరుతారు? అని.
"ఇక కనపడవద్దు" అని కోరుతాను...అన్నారు.
కనబడేది(object) దైవం కాదు...
కనేవాడు(subject) దైవం...
అన్న గురుదేవులవారి ఉపదేశాన్ని స్మరించుకుందాం...
ద్రష్ట(subject) - దైవం.
దృశ్యం(object) - ప్రపంచం.
"దృష్టే దృశ్యంగా ఉండేది..."
అనే అనుభవం కలగడమే సాక్షాత్కారం...
ద్రష్టకు విడిగా దృశ్యానికి ఉనికి లేదు...
కానీ నీవు విడిగా అనుభవిస్తున్నంతకాలం...
ఈ దృశ్యం నిన్ను బాధిస్తూనే ఉంటుంది...
ద్రష్టలో సంస్థితమై...
ద్రష్టగా ఉండటానికి చేసే ప్రయత్నమే...
ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ...
దేవుడు కనబడ్డాడు అంటే దుఃఖించండి...
దేవుడు దృశ్యంగా(object) మారిపోయినందుకు...
దేవుడు కనబడలేదు అంటే సంతోషించండి...
దేవుడు స్వరూపంగా(subject) ఉన్నందుకు...
2.5K views02:33